ప్రచారంలో దూసుకుపోతున్న ఇలియాజ్ షరీఫ్

మియాపూర్‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇలియాజ్ ష‌రీఫ్ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మియాపూర్‌లో ఎల్లవేళలా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. మక్తా మహబూబ్ పేట‌, స్టాలిన్ నగర్, ఎంఏ నగర్ ప్రాంతా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఇలియాజ్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకోసం ఆరోగ్యశ్రీ, వికలాంగ, వృద్ధాప్య పెన్షన్ లు వంటి సంక్షేమ పథకాలతోపాటు ప్రమాదంలో ఆదుకుని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనాల‌ను సైతం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రహీం, మన్నె నరేందర్, విజయ్, తిరుపతి పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఇలియాజ్ ష‌రీఫ్
హ‌స్తం గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న ఇలియాజ్ ష‌రీఫ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here