మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్‌సిటీలో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద తెరాస బ్యానర్లను చింపివేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస పార్టీ సదరు స్టేషన్ వద్ద పిల్లర్లకు కట్టిన ప్రచార బ్యానర్లను ఇద్దరు వ్యక్తులు చింపివేశారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తుల కోసం గాలించారు. కాగా వారిలో ఒకరిని సికింద్రాబాద్ లోని లాలాపేటకు చెందిన విశాల్ కుమార్ అని గుర్తించగా, మరొక వ్యక్తి కొండాపూర్‌కు చెందిన సాయి కౌశిక్ అని వెల్లడైంది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఇలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






