శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతోపాటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు, ప్రతి వీధిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని, వాటి బాధ్యతను స్థానికులు తీసుకోవాలని సాయిబాబా సూచించారు.

నల్లగండ్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్‌లోని నల్లగండ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.

ఎన్.టి.ఆర్ నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం..
శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.





