కాల‌నీల‌లో ద‌శ‌ల‌వారిగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీ, TN నగర్ కాలనీ, వీడియా కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీల వాసులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆయా కాల‌నీల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ద‌శ‌ల‌వారిగా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని తెలిపారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని అన్నారు. మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని, కాలనీలలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రవీందర్ రెడ్డి, సమ్మెట ప్రసాద్, సుప్రజ, కప్పేరా రమేష్, ఉమాకిషన్, వెంకటేశ్వరావు, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య‌, నర్సింగ్ రావు, శ్రీనివాస్ , శ్రీనివాస్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here