TN నగర్ కాలనీలో నెలకొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని TN నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, కాలనీ వాసులు స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ టీఎన్ నగర్ కాలనీలో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పాదయాత్ర చేయడం జరిగింద‌ని, టిఎన్ నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ, మంచినీటి సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని అన్నారు. డ్రైనేజ్ సమస్య పై అధికారులతో చర్చించి నూతనంగా డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు. అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడం జరిగింద‌ని, టిఎన్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అంగన్వాడీ స్కూల్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, టి ఎన్ నగర్ అధ్యక్షుడు కప్పరి రమేష్, పేర్ల పోచయ్య, చంద్రకళ, శివరాములు, మల్లేష్, శేఖర్, నరసింహ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here