మయూరి నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అంద‌జేశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. కాలనీలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ అధ్యక్షుడు కె రామరాజు, కిషోర్, హరికృష్ణ, ప్రవీణ్ రెడ్డి, రమణా రెడ్డి, రామిరెడ్డి, రఘురామ రాజు, నాగరాజు, శ్రీనివాసరావు, నరేంద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here