బీసీ ఆక్రోశ సభను విజ‌య‌వంతం చేయాలి: అయిలి వెంకన్న గౌడ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 42 శాతం BC రిజర్వేషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో నవంబర్ 15న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలోని సత్య ఫంక్షన్ హాల్ (కన్వెన్షన్ సెంటర్‌)లో బీసీ ఆక్రోశ సభ నిర్వ‌హించ త‌ల‌పెట్టామ‌ని, దీనికి బీసీ నాయ‌కులు, ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లి రావాల‌ని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్( బీపీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ స‌భ‌కు జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్‌ టి. చిరంజీవులు, విశాద‌రన్ మహారాజ్, బాలగౌని బాల్ రాజు గౌడ్ హాజరు కానున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో చురకైన పాత్రను పోషిస్తున్న బీసీ సంఘాల సారధ్యంలో బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టకుండా అడ్డుకుంటున్న BJP, బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న BRS, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్య మోసాలపై ఈ సభలో బీసీ వర్గాలు ఆక్రోశం వ్యక్తం చేయనున్నార‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అధిక సంఖ్యలో ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాల‌ని, దీని ద్వారా మూడు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్లు, కామారెడ్డి కాంగ్రెస్ హామీలను సాధించుకుందామ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here