కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు అనునిత్యం కృషి చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులోని బస్తీ దవాఖానా నుండి మొహ్మిదియా మసీదు వరకు రూ.20 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న సీసీ రోడ్ల పనులను హమీద్ పటేల్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ… కొండాపూర్ డివిజన్ లో ప్రజలకు అవసరం అయిన సీసీ రోడ్లు, విద్యుత్, వీధి దీపాలు, అంతర్గత డ్రైనేజీ, మంచి నీటి సరఫరా తదితర మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన సేవలను అందిచడం కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ త్వరిత గతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ మెంబర్ హిమామ్, ఈద్గా ప్రెసిడెంట్ జాఫర్, సయ్యద్ ఉస్మాన్, జలీల్, సయ్యద్ మఖ్బుల్, చాంద్ సాబ్, మునీర్, మాగదుమ్, జహీర్ ములిసాబ్, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.