శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని TNGOS రంగారెడ్డి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ TNGOS రంగారెడ్డి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, TNGOS రంగారెడ్డి కాలనీ అధ్యక్షుడు ధర్మారెడ్డి, సెక్రెటరీ సత్యనారాయణ రెడ్డి, కమిటీ మెంబర్లు రామచంద్ర, శాంత, రమాదేవి, గోపాల్, విశ్వనాథ్, కరుణాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






