శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.