శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సన్మానించి, అభినదించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మిత్ర హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిదని అన్నారు. అదేవిధంగా మిత్ర హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకుడు దామోదర్ రెడ్డి , మిత్ర హిల్స్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోనవల్లి వెంకట రమేష్, వైస్ ప్రెసిడెంట్ అంచట శ్రీనివాస రావు, జనరల్ సెక్రెటరీ KTR, ట్రెజరర్ అంచట సత్యనారాయణ, జాయిట్ సెక్రెటరీ వెంకట సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ అరుణ రెడ్డి, EC మెంబర్స్ మహేందర్, గోవర్ధన్, వెంకటేశ్వర రావు, శశిరెడ్డి, రాములు, గోపాల్ కృష్ణ, మాజీ అధ్యక్షుడు వీరపనేని శ్రీనివాసరావు, సెక్రటరీ కమలాకర్, కాలనీ వాసులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





