శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల అంచనా వ్యయంతో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మళ్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను, సుందరీకరణ పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులలో వేగం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఈఈ రామకృష్ణ, డిఇ వీరారెడ్డి, ఏఈ సర్వేషాం, నాయకులు నాయినేని చంద్రకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా గణేష్, మారేళ్ల శ్రీనివాస్, Md ఇబ్రహీం, కాశీనాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






