శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాపాలన విజయోత్సవాలు, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్బంగా పీజేఆర్ స్టేడియం చందానగర్ లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.మోహన్ రెడ్డి పర్యవేక్షణలో, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు అర్బన్ హెల్త్ సెంటర్ శేరిలింగంపల్లి వైద్యురాలు అన్నపూర్ణ, తన సిబ్బంది, పారామిత హాస్పిటల్ నుండి స్త్రీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ అలరించాయి. ఇందులో భాగంగా 10 వీల్ చైర్లు, 10 ట్రై సైకిల్స్, 10 హ్యాండ్ స్టిక్స్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెరిపాటి జైపాల్ తెలంగాణ రాష్ట్ర MBC చైర్మన్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, వి జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, మేకల అశోక్ కుమార్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, మహ్మద్ ఫకీర్ సాబ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, ముకుంద రెడ్డి డిప్యూటీ కమీషనర్ శేరిలింగంపల్లి, పి.మోహన్ రెడ్డి డిప్యూటీ కమీషనర్ చందానగర్, ప్రాజెక్ట్ అధికారిణి చందానగర్ సర్కిల్ ఉషారాణి, ప్రాజెక్టు అధికారిణి శేరిలింగంపల్లి నాగమల్లీశ్వరి, ఈఈ రాజు, మెడికల్ ఆఫీసర్ Dr. కె ఎస్ రవి, డిఇ దుర్గాప్రసాద్, ఎఇ లు ప్రశాంత్, ప్రతాప్, సంతోష్ రెడ్డి ,సానిటరీ సూపెర్వైసర్ శ్రీనివాస్ , స్పోర్ట్స్ వీరానంద్ పాల్గొన్నారు.