శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో 20, 21వ నెంబర్ వీధులలో 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, త్వరిత గతిన రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్ కు సూచించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తోపాటు కాంట్రాక్టర్ చంద్రయ్య, స్థానిక సీనియర్ నాయకులు యన్. రూపారెడ్డి, షేక్ ఇమామ్, సయ్యద్ అమీనుద్దీన్, సయ్యద్ ఉస్మాన్, కొడిచర్ల రవి, ఖదీర్, సంతోష్, సంజీవ, నరేష్, నారాయణ తదితరులు ఉన్నారు.