శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ యువతను ఆకట్టుకుంటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. WRPF ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ విజేతలు, గోల్డ్ మెడల్ సాధించిన S.కారుణ్య, S.హర్షవర్ధన్ రావు, వసంత్ రాథోడ్, ఎండి కైఫ్ సన్మాన కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన క్రీడాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.






