- పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్, గేల్ ఇండియా లిమిటెడ్, హెచ్‌పీసీఎల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందజేసిన మహీంద్రా జీ తో సీఎన్‌జీ పారిశుధ్య ఆటోలను కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పర్యావరణానికి హితమైన ఈ ఆటోలను తమ వంతు బాధ్యతగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ అందించడం అభినందనీయమని అన్నారు. సమాజం హితం, సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు సహాయంగా ఆటోలను అందించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కంపెనీలను ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం ఎంతో కొంత సహాయం చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ ఆటోలను కాలనీల్లో సక్రమమైన మార్గంలో ఉపయోగించాలని గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ లిమిటెడ్ డీజీఎం ముత్తం వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్స్ డీజీఎంలు ఎస్ఎం బాషా, ముఖర్జీ, చీఫ్ మేనేజర్ ఇంద్రజిత్ ముఖర్జీ, మేనేజర్ గురునాథ్, వైద్యాధికారి డాక్టర్ రవి, పారిశుధ్య అధికారి శ్రీనివాస్, పర్యావరణ అధికారి రామకృష్ణా రెడ్డి, ఎస్ఆర్‌పీ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, స్థానిక వార్డ్ మెంబర్లు గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, తెరాస నాయకులు పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, ఆటో లబ్దిదారులు, స్థానికులు పాల్గొన్నారు.