శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, శ్రేయాభిలాషులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ భోగి పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలు భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకున్నారు.