ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ లో రూ.2 కోట్ల 38 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు.
తులసి నగర్ లోని వాంబే గృహ సముదాయం నుండి జీవన్ జ్యోతి స్కూల్ వరకు రూ.37.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు, జీవన్ జ్యోతి స్కూల్ నుండి నాలా వరకు రూ.38 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు పునరుద్దరణ నిర్మాణ పనులకు, లక్ష్మీ స్వామి టెంపుల్ రోడ్డు వద్ద రూ.43 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు పునరుద్దరణ నిర్మాణ పనులకు, ఇంటి నంబర్ 4 -32 -1026 /12 /2 నుండి హెచ్‌టీ లైన్ వరకు రూ.34 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే స్ట్రాం వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులకు, లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయం నుండి ప్లాట్ నెంబర్ 102 వరకు రూ.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఓపెన్ నాలా పైన స్లాబ్ కవర్ల పునరుద్దరణ నిర్మాణ పనులకు, రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఓపెన్ నాలా పైన స్లాబ్ కవర్ల పునరుద్దరణ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత కేవలం తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అన్ని డివిజన్లలోనూ శరవేగంగా అభివృద్ది పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారి ఏఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు మహాదేవ్, బ్రహ్మం, మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు సమ్మారెడ్డి, కాశీనాథ్ యాదవ్, శివరాజు గౌడ్, రామకృష్ణ, రాజేష్ చంద్ర, పోతుల రాజేందర్, అనిల్ రెడ్డి, సత్యనారాయణ, వాసుదేవరావు, యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి, చిన్న మున్నా, కుమారి పాల్గొన్నారు.