గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చందాన‌గ‌ర్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఉన్న అండ‌ర్ పాస్ వ‌ద్ద ఓ వ్య‌క్తి మృత‌దేహం ఉంద‌ని సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి వ‌య‌స్సు సుమారుగా 30 నుంచి 35 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని, బహుశా వ‌ర్షాల కార‌ణంగా అత‌ను అండ‌ర్ పాస్ వ‌ద్ద చేరిన నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. అత‌న్ని గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here