చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా విజయం సాధించిన మంజల రఘునాథ్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు గుడ్ల ధనలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. మంజుల రఘునాథ్ రెడ్డిని కలిసి ధనలక్ష్మి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మంజుల రఘునాథ్ రెడ్డి గెలుపుకు కారణమైన తెరాస నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.