శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 54 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.19,61,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, హమీద్ పటేల్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, జిల్లా గణేష్, మారేళ్ల శ్రీనివాస్, చాంద్ పాషా, కావూరి అనిల్, పురెందర్ రెడ్డి, మల్లయ్య, మంజుల, శివ సాగర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






