కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని తెరాస సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, కార్యదర్శి బలరామ్ యాదవ్, టాక్స్ ఇన్‌స్పెక్టర్ మహీధర్, వీఆర్వో శ్రీకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి, మాధవ్, రఫీ, తెరాస నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
