వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్‌కు చెందిన పలు పార్టీల యువకులు గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి గజ్జల యోగానంద్ లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఇన్‌చార్జి ధర్మారావు, నాయకుడు ఉప్పల ఏకాంత గౌడ్ పాల్గొన్నారు.
