వ‌ర‌ద బాధితులంద‌రికీ స‌హాయం పంపిణీ

  • కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీ, అంజయ్య నగర్ ల‌లో వర్షాల కార‌ణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆర్థిక స‌హాయం రూ.10వేల‌ను కార్పొరేటర్ హమీద్ పటేల్ అందజేశారు. ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటూ అండదండలు అందజేస్తుందని తెలియజేశారు. అన్ని వేళలా సహాయక చర్యలు తీసుకోవటానికి తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేల స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రమేష్, ఏఈ శ్రీనివాస్, వార్డు మెంబర్స్ నరసింహ సాగర్, శ్రీనివాస్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ గఫుర్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, ఏరియా కమిటీ మెంబర్ రవి శంకర్ నాయక్, తాడెం మహేందర్, తెరాస నాయకులు మహ్మద్ అలీ, షబ్బీర్ అలీ, సమద్, హీనాయత్, ఆంజనేయులు, యూత్ నాయకులు దీపక్, జుబేర్, తిరుపతి, సాయి, కాలనీ వాసులు ఉన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేల స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here