శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చాకలి చెరువు సుందరీకరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి చెరువును శుభ్ర పరుస్తామని తెలిపారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామన్నారు. చెరువును సుందరీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు రవీందర్ యాదవ్, పద్మారావు, చింతకింది రవీందర్ గౌడ్, నరేష్ పాల్గొన్నారు.