నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ చైతన్య కళాశాల (మదీనగుడ శాఖ) యాజమాన్యం దిగొచ్చింది. ప్రి ఫైనల్స్ పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించడంపై దృష్టి పెట్టిన యాజమాన్యానికి విద్యార్థుల తల్లితండ్రుల నుంచి వ్యతిరెకత ఎదురైంది. ఈ క్రమంలోనే నమస్తే శేరిలింగంపల్లిలో శుక్రవారం వార్తా కథనం పబ్లిష్ ఐన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం పునరాలోచనలో పడింది. శుక్రవారం బ్యాచ్‌ల వారిగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ పరీక్షలు ఉంటాయని షెడ్యూల్ జారీచేసిన యాజమాన్యం శనివారం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. శనివారం నుంచే ఆన్‌లైన్‌లో ప్రి ఫైనల్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొంటు ప్రిన్సిపల్ టైమ్ టేబుల్‌ను విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పంపించారు. జూమ్ యాప్‌లో వీడియో కాల్‌లో పరీక్ష రాయాలని, సదరు పత్రాలను వారి తల్లితండ్రులు మరుసటి రోజు కళాశాలకు అందజేయాలని సూచించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ప్రి ఫైనల్ పరీక్షలు రాయలని, దాంతో పాటు స్టడీ అవర్స్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని, విధిగా విడియో కెమెరా ఆన్‌లో ఉంచాలని సూచించారు.
?శుక్రవారం పబ్లిష్ ఐన వార్త…