నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి శనివారం కాలనీకి విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఖాసీం ఆధ్వర్యంలో సభ్యులు, కాలనీ పెద్దలు గంగాధర్‌రెడ్డి సమావేశమయ్యారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను వారు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా డ్రైనేజీ పైప్ లైన్, బీటి రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరిత గతిన సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.