నమస్తే శేరిలింగంపల్లి: దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆషాడ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్షేత్రంలోని అమ్మవారు విజయదుర్గాదేవి అమ్మవారు శాఖాంబరిగా దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకుని బోనాలను సమర్పించారు. భక్తుల ఆటపాటలతో కోలాటాలతో ఆలయ ప్రాంగణం కోలాహలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి స్వయంగా బోనం వండి పెద్దమ్మ తల్లికి నివేదించారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలలో బోనాల వేడుకది ప్రత్యేక స్థానమని, గ్రామదేవతలు ఆరాదించుకునే ఈ ఉత్సవాలను ధర్మపురి క్షేత్రంలో మూడు దశాబ్ధాలుగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఆటపాటలతో కోలాటాలతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంతో నిండిపోయింది. అదేవిధంగా అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా 0 నుండి 16 సంవత్సరం లోపు పిల్లలకు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుచిత స్వర్ణామృత ప్రాస మందు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుచిత పంపిణీ చేశారు.