వెంక‌టేశ్వ‌రాల‌యంలో ఘ‌నంగా ధ‌నుర్మాస పూజ‌లు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 4 గంట‌లకు సుప్రభాత సేవ, అనంతరం విష్వ‌క్సేనపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ పూజ, అభిషేక ద్రవ్యముల పూజలు నిర్వ‌హించారు. 4.30 గంట‌ల నుండి 6 గంట‌ల వరకు విశేష పంచామృత అభిషేకం, విశేష పుష్ప అలంకారం, తిరుప్పావై సేవా విశేష అర్చనలు నిర్వ‌హించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి ఆధ్వ‌ర్యంలో ఈ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు.

వెంక‌టేశ్వ‌ర స్వామికి అభిషేకం చేస్తున్న అర్చ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here