చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100 శాతం పూర్తి చేసింది కేవలం తెరాస ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలో మొత్తం రూ.1 కోటి 85 లక్షల 10వేల అంచనా వ్యయంతో పలు ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. తారానగర్‌లోని శ్రీటవర్స్ నుంచి నాలా వరకు రూ.39.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వరద నీలి కాలువ నిర్మాణ పనులకు, జవహర్ నగర్‌లోని పలు ప్రాంతాల్లో రూ.96.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వీడీసీసీ రోడ్లు, వరదనీటి కాలువ నిర్మాణ పనులకు, విద్యానగర్, అర్జున్‌రెడ్డి కాలనీల్లోని పలు ప్రాంతాల్లో రూ.48.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కరోనా ఉన్నప్పటికీ ఎక్కడా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆపలేదని, అవి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో శేరిలింగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, పనులను త్వరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రాఘవేంద్ర రావు, రవీందర్ రావు, మోహన్ గౌడ్, సునీత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, దాసరి గోపి, జెరిపాటి రాజు, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, మిరియాల ప్రీతమ్, అక్బర్ ఖాన్, వెంకటేశ్వర్లు, గురుచరణ్ దూబే, కృష్ణ దాస్, కాలనీ వాసి నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.