కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి) : రానున్న పట్టభద్రుల ఎన్నికలలో తెరాస బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని దర్గా సాయి నగర్‌గా, పాన్ మక్తాలలో మంగళవారం కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించి పట్టభద్రులను కలశారు. ఎమ్యెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వారికీ వివరించి, ఫారం 18 ను అందజేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల పట్టభద్రులు సంతృప్తి వ్యక్తం చెయ్యటం మన తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనంమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ భాద్యతగా ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెరాస కార్యకర్తలు అందరూ కూడా ఎమ్యెల్సీ ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నేమూరి రాములు గౌడ్, నాగపూరి జనార్దన్ యాదవ్, అంజి బాబు గౌడ్, రాజేష్, ప్రవీణ్ గౌడ్, చిన్న గౌడ్, రాంబాబు, చంద్రయ్య, క్రిష్టయ్య, శంకర్ యాదవ్, మహేష్ యాదవ్, వంశీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.