శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు, సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే నాలాల విస్తరణ నిర్మాణం పనులను, RCC బాక్స్ నిర్మాణం పనులను SNDP విభాగం ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పనులలో వేగం పెంచాలని , యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. పనుల పై పలు సలహాలు , సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SNDP అధికారులు ఈఈ సత్యనారాయణ , డీఈ వశిధర్, ఏ. ఈ వెంకటేష్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.