నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ప‌నుల‌ను చేప‌ట్టాలి: PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన , మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన PAC చైర్మన్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here