శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా యాదవ మహాసభ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ..యాదవులంతా ఐకమత్యంగా ఉండాలని రాజకీయంగా ఆర్థికపరంగా ముందంజలో ఉండాలని తెలియపరిచారు. పాండవుల పక్షాన ధర్మం, న్యాయం ఉండటం వల్లనే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డారని, యాదవులు కూడ శ్రీకృష్ణుని మార్గంలో పయనించి దేశం, సమాజం కోసం ధర్మం పక్షాన నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ ప్రెసిడెంట్ బద్దుల బాబురావు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షులు గొర్ల యశ్వంత్ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, ఐలేష్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి పోచబోయిన వినోద్ యాదవ్, అఖిల భారత యాదవులు తదితరులు పాల్గొన్నారు.