శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వావిలాల జడ్‌పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా టీచర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 7వ తరగతికి చెందిన యశ్విత శ్రీ సావిత్రి బాయి పూలె వేష ధారణలో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణి మాధవిలత, జయలత, అనురాధ, మాధవి, పద్మిని, మానస, రాజారావు, రాజిరెడ్డి, పవన్ రాజు, రుషి శర్మ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.