శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను డీఈవో సుశీందర్ రావు, ఎంఈవో ఎస్.వెంకటయ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గచ్చిబౌలి జడ్‌పీహెచ్ఎస్, ఎంపీపీఎస్‌లను వారు సందర్శించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో వారు మాట్లాడారు. వారి సిలబస్‌ను వాకబు చేశారు. ఈసారి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.