శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయలంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారులను అడిగి అభివృద్ధి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. హెచ్ సిటీ పనులు, ఎస్ఎన్‌డీపీ, బహిరంగ ప్రదేశాల తనిఖీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త డంపింగ్ ప్రాంతాల పునరుద్ధరణ, నీరు నిల్వ ఉండే ప్రాంతాల గుర్తింపు, వీధి కుక్కల నియంత్రణ, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించడం వంటి అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.






