శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఏసీపీలు, ఏఎంసీలు, డిప్యూటీ ఈఈలు (మెయింటెనెన్స్), ఎస్డబ్ల్యూఎం ఏఈలు, యూబీడీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ పలు అంశాలపై సమీక్ష చేపట్టారు. సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఖాళీగా ఉన్న స్థలాలు, పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, థిమాటిక్ పెయింటింగ్స్, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించడం, రెవెన్యూ వసూళ్లు తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.






