శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ శశిరేఖ పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఆస్తి పన్ను వసూలు మెరుగుదల, వాణిజ్య లైసెన్స్ రుసుము, TGSPDCL, GIS వినియోగ మార్పు, GIS అంచనా వేయబడని వాటి సవరణ, మీసేవా దరఖాస్తులు, చందానగర్ సర్కిల్ 21లో IGRS డోర్ నెంబర్ ఇన్క్లూజన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో AMCలు, TIలు, BCలు పాల్గొన్నారు.






