సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప వద్ద సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో శారద స్కూల్ నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల‌లో శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, టీపిసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక పేద వృద్దులకు బెడ్ షీట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని, వాటిని ప్రతిఒక్కరూ ఆచరించాలని సూచించారు. పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ సందేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ రోజీ, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామ స్వామి యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ మెంబర్స్ సరిత, చందన, శేరిలింగంపల్లి మండల‌ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ఆపిల్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ నీత రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, చాంద్ పాషా, సంకల్ప ఫౌండేషన్ బోర్డు మెంబ‌ర్స్ సురేఖ, లక్ష్మి, ఇంద్ర, మహాలక్ష్మి, తరుణం, బీస్మాట్ జనరల్ భరత్ కుమార్, శేఖర్ రెడ్డి, వెంకర్ రావు, జితేందర్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మి, కుమారి, కళ్యాణి, సుధారాణి, లక్ష్మి, జయ, గౌసియా, ఫాతిమ, అరుణశ్రీ, ఆశ్రఫ్, నర్సింహులు, కుటుంబరావు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here