మాదాపూర్, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో మహతి కళా సమితి గురువు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందం శ్రీ కళ్యాణం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలను కొన్నింటిని అచ్యుతుని రాధాకృష్ణ నృత్య రూపకంగా రూపొందించారు. గోవిందరాజు శ్రీదేవి నృత్య రూపకల్పన చేసి తన శిష్యులతో ఎన్నో ప్రదర్శనలు ఇప్పించారు. వారి జయంతి సందర్బంగా ఆ శిష్య బృందం వారికి శ్రీ కళ్యాణం నృత్యార్పణం చేశారు.
వకుళ మాత, ఎరుకల సాని, ఆకాశరాజు, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఘట్టాలను కళాకారులు సౌమ్య, నారాయణ మూర్తి, అక్షిత, పవిత్ర, శ్రావణి, సహస్ర, మనస్విని, దుర్గా భవాని, మహతి, నేత్ర మొదలైన వారు ప్రదర్శించారు. నాట్య గురువులు రత్న శ్రీ, రుద్రవరం సుధాకర్, వాణి రమణ, ఉషా రాణి ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను అభినందించారు.