శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య గురువు రాగిణి ఇయర్, రక్షిత రఘునాధన్ శిష్య బృందం అమ్రితా, అనన్య, వైశిష్ట్య అనన్య అనూప్ శతాక్షి , అనివార్ధి, నక్షత్ర లు తమ ప్రదర్శనలో మల్లారి, తోదయ మంగళం, పుష్పాంజలి, అలరిపు, నటేశకౌతం,రామనవరస , సాధించని, అలరులు కురియగా, శ్రీ సరస్వతి, భో శంభో, దశావతరం, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.






