సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి అరుదైన గౌరవం

  • శేఖర్ సగర కు డాక్టరేట్ అవార్డ్ ను ప్రదానం చేసిన అమెరికా కాలిఫోర్నియా గ్లోబల్ యూనివర్సిటీ
  • డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర కు శుభాకాంక్షలు తెలిపిన సగర సంఘం నాయకులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థి దశ నుంచి ఎబివిపి, ఆర్.ఎస్.ఎస్ లో నేర్చుకున్న క్రమశిక్షణ, కార్యదీక్ష, జర్నలిస్ట్ గా 25 సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, జ‌ర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (TUWJ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పిన బుచ్చమ్మొళ్ళ వెంకటమ్మ పరమయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా పేద విద్యార్థులకు చేసిన సేవలు, తెలంగాణ సగర కులాన్ని జాగృతం చేయడంలో గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్న సేవలను గుర్తించి అమెరికా కాలిఫోర్నియా గ్లోబల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డ్ ను ప్రదానం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నోయిడా మయూరి విహార్ లోని హోటల్ హాలిడే ఇన్ లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ హీరో రాహుల్ రాయ్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర కు సగర సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, బీసీ సంఘం నాయకులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here