మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం డాక్టర్ మైథిలి అనూప్ శిష్య బృందంచే మోహినియాట్టం నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గణపతే, జతిస్వరం, దేవి కీర్తనం, యమునాష్టకం, రితుసంహారం, భూపాళం తిల్లాన, మంగళం తదితర అంశాలను డాక్టర్ మైథిలి అనూప్, వీణ ఉన్ని కృష్ణన్, అంజనా మీనన్, షేర్ల, శ్రీజ గోపకుమార్ లు ప్రదర్శించి అలరించారు.
