మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యాంఫీ థియేటర్ లో నృత్య కిన్నెర గురువు డాక్టర్ మద్దాలి ఉష గాయత్రీ శిష్య బృందం ” శ్రీ ఆండాళ్ కీర్తన నృత్య వైభవం” నృత్య రూపకాన్ని ప్రదర్శించింది. హర్షిత రెడ్డి, త్రిత్వ రెడ్డి, శ్రీ చక్రి లు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అలరించారు.