గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారి తనయుడు సాన్విత్ పుట్టినరోజు సందర్భంగా ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. పుట్టినరోజు నాడు ఆడంబరాల కోసం పెట్టే ఖర్చు బదులు ఓ నిరుపేద ఇంటిని నిలబెట్టడంలో ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఈ అవకాశం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు శిరీష సత్తూర్ తెలిపారు.






