గోపిన‌గ‌ర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ నాగేంద‌ర్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత, ప్ర‌మాణాల గురించి కాంట్రాక్ట‌ర్‌ను అడిగి తెలుసుకున్నారు. బ‌స్తీలోని స‌మస్య‌ల‌ను స్థానిక ప్రజల కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకురాగా పరిక్షారం అయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, యాదగౌడ్, గోపినగర్ బస్తి అధ్యక్షులు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ బస్తి యూత్ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ చంద్రయ్య, నాయ‌కులు కేఎన్‌ రాములు, గఫ్ఫార్, చారి, నర్సింహా, ఎల్లదాసు, కృష్ణారెడ్డి, ఈశ్వర్,కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

గోపిన‌గ‌ర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న‌ కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here