కల్వర్టుల నిర్మాణం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం మెయిన్ రోడ్ లో శ్రీ సత్యలక్ష్మి నగర్ కాలనీ, మయూరి నగర్ కాలనీ,హెడిఎఫ్‌సీ బ్యాంక్ హై టెన్షన్ లైన్ కింద నూతనంగా నాలా మీద కల్వర్టుల నిర్మాణం చేపట్టే పరిసర ప్రాంతాలను హెచ్ఎండిఏ అధికారులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, జలమండలి అధికారులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా నాలాల మీద కల్వర్టుల నిర్మాణం చేపట్టే పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని, ఎన్నో ఏండ్ల సమస్య కల్వర్టుల నిర్మాణం ద్వారా తీరుతుంద‌ని, మియాపూర్ నుండి ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంద‌ని అన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి పిఎసి చైర్మన్, ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన పనులను విడతల వారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డిఈ విద్యాసాగర్, ఏఈ ఆశిష్, జెఈ ఐ కె రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డి ఈ దుర్గా ప్రసాద్, జలమండలి డిజిఎం శ్రీ నారాయణ, మేనేజర్ సునీత, వర్క్ ఇన్‌స్పెక్టర్లు నవీన్, లింగయ్య, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here