శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న Har Ghar Tiranga కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్లోని గోపనపల్లి గ్రామం, మంజీర డైమండ్ హైట్స్ కాలనీలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రతి ఇంటిపై గర్వంగా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశభక్తిని ప్రజల్లో పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలునిచ్చిన విధంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ఎంతో ప్రతిష్టాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భారతదేశంపై గౌరవం పెరిగేలా చేయాలన్నదే లక్ష్యమన్నారు. అన్ని డివిజన్లలో, బూత్ స్థాయిలో తిరంగ యాత్ర విజయవంతం చెయ్యాలని నాయకులు , కార్యకర్తలను కోరారు, తాను కూడా స్వయంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివా సింగ్, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, దయాకర్, స్వామి గౌడ్ , సురేందర్ ముదిరాజ్, మహిళా మోర్చా నాయకురాలు వరలక్ష్మి, నరసింహ రావు, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు సామ్రాట్ గౌడ్, కవితా భాయ్, మహిళా మోర్చ డివిజన్ అధ్యక్షురాలు ఉదయ లక్ష్మీ, డివిజన్ నాయకులు బబ్లూ, జితేందర్ సింగ్, రేవతి, శేషి, బెనర్జీ, సత్యనారాయణ, ఆశావరి , శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.






