శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ 2025 సందర్బంగా ప్రదర్శిస్తున్న చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో సంజన సంగీత కచేరి అలరించింది. భక్తి గీతాలు, అన్నమయ్య, రామదాసు సంకీర్తనలను ఆలపించి అలరించారు. వీరికి మృదంగ సహకారం వెంకటేష్, వయోలిన్ పై నారాయణ సహకరించారు. అనంతరం నాట్య గురువు ప్రశాంతి వేమవరపు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. తరంగం, ఒకపరి కొకపరి , బ్రహ్మాంజలి, తిల్లాన, ఎముకు , అదిగో అల్లదిగో, రామ రామ భజన, మూషిక వాహన అష్టలక్ష్మి, ముద్దుగారే యశోద, భామాకలాపం అంశాలను కృష్ణ ప్రియా, కారుణ్యరెడ్డి, రోషిని, నాయన, శరణ్య శ్రీ, నివేద లు ప్రదర్శించి మెప్పించారు.






